తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయంకు కొత్త భద్రత

-

 

మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. టీఎస్ఎస్పీ కి కొత్త సెక్రటేరియట్ భద్రతను అప్పగిస్తున్నట్లు తెలిపింది. గత 25 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రముఖుల భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, కొత్త సెక్రటేరియట్ భద్రతను చూస్తున్న ఎస్పీఎఫ్ ను పక్కకు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ఎలాంటి కారణాలను తెలపలేదు సర్కార్. ఎస్ పీఎఫ్ కు బదులుగా సెక్రటేరియట్, ప్రభుత్వ ఆస్తుల భద్రతను టీఎస్ఎస్ పీకి అప్పజెప్పింది. బందోబస్తు, వీఐపీ సెక్యూరిటీ, కూంబింగ్ లలో టీఎస్ ఎస్పీ సేవలు అందించనుంది. టీఎస్ఎస్ పీ కి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ టైమ్ వెపన్ ట్రైనింగ్ ఇచ్చింది.

 

1998లో స్పెషల్ జీఓతో సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ ప్రొటక్షన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 1650 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండేవారు. ఇంతకుముందు సెక్రటేరియట్ లో 150 మంది ఎస్ పీఎఫ్ సిబ్బంది సేవలు అందించడం జరిగింది. ప్రధాన ఆలయాలు, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఎస్పీ ఎఫ్ బందోబస్తు నిర్వహించే వారు. వాహనాల తనిఖీ, అబ్జర్వేషన్, వ్యక్తులపై మానిటరింగ్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 1991 లో ఎస్పిఎఫ్ ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాలుగా సెక్రటేరియట్ లో ఎస్పీ ఎఫ్ సెక్రటేరియట్ లో సేవలందిస్తోంది. ప్రస్తుతం ఎస్పీ ఎఫ్ డీజీగా ఉమేష్ షరాఫ్ ఉన్నారు. అయితే గత 25 ఏళ్లుగా ఉన్న ఎస్పీఎఫ్ కు బదులు టీఎస్ఎస్ పీ కు సెక్రటేరియట్ భద్రతను అప్పగించడమేంటని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version