BIG BREAKING : ఉప రాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్కర్‌ విజయం

-

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రి 5 గంటల వరకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించి విజేతను ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో.. భారత ఉప రాష్ట్రపతి ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్కర్‌ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్‌ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరఫున ఎన్నికల బరిలో నిలిచిన జగదీప్‌ ధన్కర్‌కు 528 ఓట్లు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 11న పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు జగ్‌దీప్‌ ధన్కర్‌. జగదీప్‌ 1951, మే 18న రాజస్థాన్‌లో కితానాలో హిందూ జాట్‌ కుటుంబంలో జన్మించారు జగ్‌దీప్‌ ధన్కర్‌. ఆయన తల్లిదండ్రులు గోకుల్‌ చంద్‌, కేసరీదేవి. జగ్‌దీప్‌కు భార్య సుదేశ్‌, కుమార్తె కామ్న ఉన్నారు.

చిత్తరోగఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు జగ్‌దీప్‌ ధన్కర్‌. రాజస్థాన్‌ వర్సిటీలో బీఎస్‌సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. 1979లో రాజస్థాన్‌ బార్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకుని, ఆ తర్వాత రాజస్థాన్‌ బార్‌ అసోసియేషన్‌
అధ్యక్షుడిగా పని చేశారు. సట్లెజ్‌ నీటి వివాదంలో హరియాణా ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు జగ్‌దీప్‌ ధన్కర్‌. ఆయన 1989 రాజస్థాన్‌లో ఝంఝను లోక్‌సభ నుంచి ఎన్నికయ్యారు జగ్‌దీప్‌ ధన్కర్‌. 1990-1991 మధ్య కేంద్ర సహాయమంత్రిగా పని చేశారు. 1993లోని కిషన్‌గడ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 జూలై 20న జగ్‌దీప్‌ నియాకమయ్యారు. మమతా బెనర్జీ  నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు జగ్‌దీప్‌ ధన్కర్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version