తెలంగాణ పోలీసులు సూసైడ్‌ చేసుకుని చావండి – జగ్గారెడ్డి

-

తెలంగాణ పోలీసులు సూసైడ్‌ చేసుకుని చావండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. రామాయణం పేట పోలీసులకు సిగ్గు అనిపించడం లేదా..? మి డ్రెస్ కు ఏం విలువ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పోలీసులు సూసైడ్ చేసి చావండంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం ఘటనపై ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు జగ్గారెడ్డి.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… Trs నాయకుల వేధింపులతో ఎవరు సచ్చిన సీరియస్ గా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకోవాలని.. సీఎం మౌనంగా ఉండటం వళ్ళ..ఎన్నో అనర్థాలు జరుగుతాయని ఫైర్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ మంచొడే… కానీ ఇలాంటి వాటిపట్ల సైలెంట్ గా ఉండటం వల్ల మికే చెడ్డ పేరన్నారు.

అలాగే.. బండి సంజయ్ కి జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సీఎం కెసిఆర్ ను జైల్లో పెడతా అని మాటలు చెప్పడం కాదని.. బీజేపీ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే… ఎందుకు సైలెంట్ గా ఉన్నావని ప్రశ్నించారు. మంత్రి మీద కేసులు పెట్టీ..బర్తరఫ్ చేసే వరకు బీజేపీ ఉద్యమం చేయాలని… లేదంటే… టీఆర్‌ఎస్‌, బీజేపీ మద్య దోస్తీ ఉందనే నిరూపించినట్టని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version