మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగ్గారెడ్డి సతీమణి…?

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మెదక్ నుంచి బరిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున రాయల నాగేశ్వరరావు దిగబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లను సూచిస్తూ అధిష్టానం కు టి.కాంగ్రెస్ పంపించింది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీ ఫామ్ అందించనున్నారు.

Jaggareddy s wife as congress mlc candidate
Jaggareddy s wife as congress mlc candidate

మధ్యాహ్నం జగ్గారెడ్డి భార్య నిర్మల గౌడ్ నామినేషన్ వేయనున్నారు. మిగతా స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్, నల్గొండ, వరంగల్ లోనూ పోటీ చేయలని కాంగ్రెస్ భావించినట్టు తెలుస్తోంది. అయితే పోటీ చేయడానికి కాంగ్రెస్ నేతలు ముందుకు రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో ఆ స్థానాల్లో పోటీ చేసే ఆలోచనను టీపీసీసీ విరమించుకుంది.