కంటతడిపై చంద్రబాబుకు ముద్రగడ లేఖ.. నేను ఆత్మహత్య చేసుకునేవాన్ని !

-

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవడం ఆశ్చర్యం కలిగించిందని చురకలు అంటించారు ముద్రగడ. నాడు మా కుటుంబానికి మీరు చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.

మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నానని.. ఇంటి తలుపులు బద్దలుకొట్టి కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ ఈడ్చుకెళ్లడం చంద్రబాబుకు గుర్తు లేదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు పుత్రరత్నం తరచూ పోలీసులకు ఫోన్ చేసి మమ్మల్ని అవమానించమన్నారని నిప్పులు చెరిగారు. రాజమండ్రి ఆసుపత్రిలో మమ్మల్ని 14 రోజులు నిర్భందించి చంద్రబాబు రాక్షసానందం పొందారని ఫైర్ అయ్యారు. శపథాలు ఇందిరాగాంధి, ఎన్టీఆర్, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వారికే సొంతమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు చేసిన ముఖ్యమంత్రి శపథం నీటి మీద రాత అని గ్రహించాలని ఎద్దేవా చేశారు. జీవితాలు, ఆస్తులు, పదవులు ఎవ్వరికీ శాశ్వతం కాదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news