కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి మాట్లాడుతూ 15 లోక్సభ స్థానాలని కాంగ్రెస్ గెలవబోతోందని అన్నారు. రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ల పాటు దొరల పాలన చూశారని జగ్గారెడ్డి అన్నారు. అలానే జగ్గారెడ్డి మాట్లాడుతూ హామీ ఇచ్చిన రెండు గ్యారెంటీ లని త్వరలో అమలు చేస్తామని చెప్పారు.
అలానే ఆయన ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కెసిఆర్ మీద విరుచుకుపడ్డ విషయం మనకి తెలిసిందే. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని కెసిఆర్ అన్న మాటకి బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నేతలు బిజెపిలో ఇద్దరు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీలలో లీడర్ కి కొదవలేదని కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి.