కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సీరియస్ అయ్యారు. రైతుల నిరసనలు ఆర్టికల్ 370 రద్దు సహా పలు అంశాల గురించి ఆమె మండిపడ్డారు. కేరళ లోని త్రిస్సూర్ లో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా చట్టాలు అమలు చేశారని మండిపడ్డారు.
లక్షలాది మంది రైతులు నెలలు తరబడి నిరసనలు చేశారని గుర్తు చేశారు నిరసన చేసిన రైతులకు కొంతమంది మరణించారని అన్నారు. వారిలో కొందరిని తీవ్రవాదులను అని ఇంకొందరిని దేశ వ్యతిరేకులని పిలిచి నిరసనని కొనసాగించాలని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు మీద కూడా ఆమె స్పందించారు. జమ్ము కాశ్మీర్ ప్రజల గొంతుకులు ప్రభుత్వానికి నిలబడట్లేదని చెప్పారు ఈ దేశంలో ఒక రాష్ట్రం మొత్తం నెలలు తరబడి ఇంటర్నెట్ ఫోన్స్ ఎవరూ లేకుండా కొట్టుమిట్టాడుతోందని అన్నారు.