చిరంజీవి, పవన్ పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ..నల్లా చట్టాలు తెచ్చి రైతుల చావులకు కారణమైన ప్రధాని మోడీని అభినందించిన చిరంజీవి..అదే రైతుల క్షేమం కోసం పోరాడిన రాహుల్ గాంధీకి మాత్రం మద్దతు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

రైతుల నష్టాలపై సినిమాలు తీసే చిరంజీవి.. బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలపై ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఉంటే మంచిదారిలో ఉండేవాడని .. కానీ ఇప్పుడు పక్కదారి పట్టాడని ఆయన సంచల వ్యాఖ్యలు చేశారు.ఇక, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో కేసీఆర్ రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో అప్పటి మంత్రి హరీష్ రావు భాగస్వామి కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి సర్కార్ రుణమాఫీ చేయడంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు షాక్‌లో ఉన్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్‌లు చేయడానికి మాత్రమే పనికి వస్తారని జగ్గారెడ్డి సెటైర్ వేశారు. కాగా, ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. కొన్నాళ్ల తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసిన మెగాస్టార్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version