నెహ్రూ శిక్ష అనుభవించిన ఆ జైలు కూలిపోయింది..!

-

అప్పట్లో జైలులో నెహ్రూతో పాటు మరికొందరు సమరయోధులు ఆ జైలులో ఉన్నారు. ఆ జైలులో నెహ్రూ రెండేళ్ల పాటు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. కాలక్రమేణా ఆ జైలును ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి.

భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో స్వాత్రంత్య సమరయోధులను బ్రిటీష్ వాళ్లు జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మహానుభావులు జైలులో ఏళ్లకు ఏళ్లు గడిపారు. అందులో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు. ఆయన కూడా స్వాతంత్రోద్యమ సమయంలో చాలా ఏళ్లు జైలులో ఉన్నారు. పంజాబ్ లోని జైటు జైలులో ఆయన్ను ఉంచారు.

అయితే.. ఆ జైలు తాజాగా కూలిపోయింది. బీహార్, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల ధాటికి పలు చారిత్రక కట్టడాలు నేలమట్టం అవుతున్నాయి. నెహ్రూ శిక్ష అనుభవించిన జైలు కూడా వర్షాల ధాటికి కూలిపోయింది.

అప్పట్లో జైలులో నెహ్రూతో పాటు మరికొందరు సమరయోధులు ఆ జైలులో ఉన్నారు. ఆ జైలులో నెహ్రూ రెండేళ్ల పాటు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. కాలక్రమేణా ఆ జైలును ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నదని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదనే విమర్శలూ ఉన్నాయి.

2008లో రాహుల్ గాంధీ ఆ జైలును సందర్శించారు. అప్పట్లో యూపీఏ హయాంలో దాని మరమ్మతు కోసం నిధులు కేటాయించినప్పటికీ.. దాన్ని పంజాబ్ ప్రభుత్వం పునర్నిర్మించలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు. దీంతో భారీ వర్షాలకు అది కుప్పకూలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version