“జైలర్” ప్రభంజనం: తలైవా దెబ్బకు రెండు రోజుల్లో రూ. 152.02 కోట్లు

-

ఆగష్టు 10వ తేదీన తమిళ మరియు తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకువెళుతోంది. ఇందులో తలైవా రజినీకాంత్ హీరోగా , తమన్నా, మోహన్ లాల్ మరియు శివ రాజ్ కుమార్ లు కీలక పాత్రలలో నటించి సినిమా సక్సెస్ లో భాగం అయ్యారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారట. ఇక అనిరుద్ మ్యూజిక్ తో సినిమాను వేరే లెవెల్లోకి తీసుకువెళ్లాడు. కాగా సినిమా యూనిట్ నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం జైలర్ మూవీని ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆదరిస్తున్నారు. ఈ సినిమా విడుదల అయ్యి కేవలం రెండు రోజులే అవుతున్నా బాక్స్ ఆఫీస్ ను షాక్ చేసేస్తుందని టాక్, మేకర్స్ తెలుపుతున్న ప్రకారం రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ. 152 .02 కోట్లు కలెక్ట్ అయిందట.

కాగా ఇక మూడవ రోజు ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుంది. ఈ లెక్క తీసుకుంటే జైలర్ మూవీ ఇంకెన్ని వందల కోట్లను కొల్లగొడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news