ఉప‌వాసం చేసింది… ప్రాణాలు పోగొట్టుకుంది..

-

స‌హ‌జంగా భ‌క్తితో దేవుడిని పూజించి ఉప‌వాసాలు చేప‌ట్టేవారు ఎంద‌రో. అయితే న‌మ్మ‌కం ఉండ‌వ‌చ్చు కానీ మ‌రీ మితి మీరితే మాత్రం ప్రాణాల మీద‌కు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఓ యువ‌తి భ‌క్తితో ఉప‌వాస దీక్ష చేప‌ట్టి ప్రాణాలు పోగొట్టుకుంది. వివారాల్లోకి వెళ్తే.. జైన సంప్రదాయం ప్రకారం ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన 25 ఏళ్ల‌ జైన్‌ మహిళ ఏక్తా అశుభాయ్‌ గల హఠాన్మరణానికి గురయ్యారు. ఏక్తా ఉపవాసదీక్ష కోసం గుజరాత్‌లోని కచ్‌లో నెల కిందట పుట్టింటికి చేరుకున్నారు.


ఏక్తా తన ఏడు రోజుల నిరంతర ఉపవాసాన్ని ఆగస్టు 27 న ప్రారంభించింది. ఐదు రోజుల తరువాత, ఆమె  తీవ్రమైన అనారోగ్యానికి గురవ‌డంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు కుటుంబ స‌భ్యులు. ఈ క్రమంలో డాక్టర్ తోపాటు స్థానిక జైన మత గురువు జైన్ మహారాజ్ కూడా ఆమెను ఉపవాసం విరమించాలని కోరారు. రోజులో ఒక పూటైనా భోజనం చేయాలని సూచించారు. కానీ  ఏక్తా నిరాకరించారు. తాను ఉపవాసాన్ని కొనసాగిస్తానని చెప్పింది.

జైన మ‌త సంప్ర‌దాయాలు ఉల్లంఘించ‌న‌ని ఖ‌రాఖండీగా చెప్పింది. సెప్టెంబర్ 3న ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో ఆమెకు గ్లూకోస్ పెట్టారు. అప్ప‌టికీ ఆమె జైన విశ్వాసాల ప్రకారం బాయిల్డ్‌ వాటర్‌ను త్రాగడానికి మాత్ర‌మే ఆగీక‌రించింది. అయితే బుధవారం రోజు రాత్రి ఆమె గుండెపోటుతో మరణించారు. దేవుడుపై, ఆచారాల‌పై విశ్వాసం ఉండాలి కానీ మూర్ఖ‌త్వ విశ్వాసం ఉండ‌డంతో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news