ఇండియా, న్యూజీలాండ్ టీ20 మ్యాచ్ కు పొల్యూషన్ ఎఫెక్ట్..

-

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీపావళి తర్వాత నుంచి ఢిల్లీని కాలుష్యం వదిలిపెట్టడం లేదు. హర్యానా, పంజాబ్ లో పంట వ్యర్థాలు తగలబెట్టడం, ఢిల్లీలోని వాహనాల రద్దీ వాయుకాలుష్యానికి ప్రధానం అవుతున్నాయి. మరోవైపు ఢిల్లీ కాలుష్యం ఇతర నగరాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఢిల్లీకి సమీపంలో ఉండే హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వాయు కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. తాజాగా రాజస్థాన్ రాజధాని పింక్ సిటీ జైపూర్ ను కూడా కాలుష్యం భయపెడుతోంది.

జైపూర్ నగరాన్ని వాయు కాలుష్య మేఘాలు కమ్మెస్తున్నాయి. ఈనెల 17న ఇండియా, న్యూజీలాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరుగనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ ఇంటర్నేషన్ స్టేడియం ఈ మ్యాచుకు ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా ప్రస్తుతం జైపూర్ లో కూడా కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో ఇండియా, న్యూజీలాండ్ మధ్య జరగాల్సిన టీ 20 మ్యాచ్ సందిగ్థంలో పడింది. కాగా సోమవారం జైపూర్ లో వాయు కాలుష్యం ’వెరీపూర్‘ కేటగిరి నుంచి ’పూర్‘ కేటగిరిలోకి మారింది. జైపూర్ లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సోమవారం కాస్తంత మెరుగైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version