ఉగ్రవాద భాదిత రాష్టంగా ఉన్న జమ్ము కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. 90 అసెంబ్లీ స్థానాలకు దశలవారీగా ఎన్నికలు జరగనున్నాయి.. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్-370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఇవి…సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. 2014 నాటి పరిస్థితికి.. ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉండటంటో ఓటర్లు ఎవరికి జై కొడతారా అనేది ఉత్కంఠగా మారింది.. జమ్ము కశ్మీర్ చరిత్రలోనే కీలక ఎన్నికలుగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి..
స్థానిక పార్టీలుగా ఉన్న పీడీపీ, ఎన్సీతో పాటు.. బిజేపీ, కాంగ్రెస్ లు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో పీడీపీ, బిజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఆ రెండు పార్టీల మధ్య విబేదాల కారణంగా 2018లో బిజేపీ తమ మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది.. అదే ఏడాది డిసెంబర్ లో రాష్టపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ కు రాష్టహోదా తొలగించారు..
హిందువులు ఎక్కువగా నివసించే జమ్ము ప్రాంతంలొ 43 సీట్లు ఉండటంతో బిజేపీ ధీమాగా ఒంటరి పోరుకు సిద్దమైంది.. పోలింగ్ తర్వాత 10 మంది స్వతంత్రులను తమవైపుకు తిప్పుకునే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ పదేళ్ల కాలంలో బిజేపీ హయాంలో జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదం బాగా తగ్గిందనే విషయాన్ని బిజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తోంది.. ఓటర్లు సైతం బిజేపీకి ఆకర్షితులవుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.. దీంతో జమ్ముకశ్మీర్ లో బిజేపీ గెలుపు ఖాయమనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది..