ఎలుకలు కరిచిన గురుకుల విద్యార్థులకు BRS నేతల పరామర్శ

-

తెలంగాణలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలకు కేరాఫ్‌గా గురుకుల పాఠశాలలు నిలుస్తుండగా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గురుకుల పిల్లలు తినే భోజనంలో పురుగులు వస్తున్నాయని పలు కథనాలు కూడా వచ్చాయి. దీనికి తోడు సమస్యలపై ప్రశ్నించినందుకు గాను వార్డెన్స్ భోజనం సరిగా పెట్టడం లేదని, అడిగితే కొడుతున్నారని కొందరు విద్యార్థినిలు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించిన ఘటన గురించి సైతం వార్తా కథనాలు వచ్చాయి.1

అయితే, నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండభీమనపల్లి బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినిలను ఎలుకలు కరిచాయి. దీంతో పలువురు విద్యార్థినిలు ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. తాజాగా వారిని బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గాదరి కిశోర్ కుమార్ పరామర్శించారు. బాధిత విద్యార్థినులను అడిగి వివరాలు సేకరించారు. గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news