జమ్మూ కా శ్మీర్ లో నేడు ప్రధాని మోదీ పర్యటన

-

జమ్మూకాశ్మీర్ లో నేడు ప్రధాని మోదీ పర్యటించనున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. కాశ్మీర్ అభివృద్దికి సంబంధించి పలు ప్రాజెక్టులకు ప్రారంభించనున్నారు. రూ. 20 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లా పల్లి నుంచి దేశంలోని గ్రామ పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ టన్నెల్ మరియు ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే, రాటిల్ & క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ది ప్రాజెక్టుల్లో ఉన్నాయి. 500 కేవీ సోలర్ విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు ప్రధాని. 

ఇదిలా ఉంటే ప్రధాని పర్యటనతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు భద్రతా బలగాలు. ప్రధాని పర్యటనకు రెండు రోజులు ముందు కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ప్రధాని పర్యటనకు ముందు ఏదైనా కుట్ర కోణం ఉందా అని అనుమానాలు తలెత్తాయి. దీంతో ప్రధాని పర్యటిస్తున్న పల్లి ప్రాంతంలో భద్రతా దళాలు సెక్యుటరిటీ టైట్ చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version