పవన్ కళ్యాణ్ మాల.. ఎర్ర కండువాతో జనసైనికుల దీక్ష.. 49 రోజులు అలానే ఉంటారంట..!

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ జనసేన జనవాణి పేరుతో సమస్యలతో బాధపడుతున్న వారి వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సెప్టెంబర్‌ 2. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌ కళ్యాణ్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ సెప్టెంబర్‌ 2తో పవన్‌ కళ్యాణ్‌కు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్న క్రమంలో పాలకొల్లుకు చెందిన పలువురు యువకులు పవన్‌ కళ్యాణ్‌ మాల ధరించారు. 49 రోజుల పాటు ఎర్ర కండువాలు ధరించి ప్రజలకు సేవ చేయనున్నట్లు ప్రకటించారు ఆ యువకులు.

ఈ 49 రోజులు పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళుతూ.. ఆయన కోసం పనిచేస్తూ.. నీతిగా నిజాయితీగా.. ఎలా ఉండాలో నేర్చుకుంటూ.. పవన్‌ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచి ఆయనకు మరింత పేరు తీసుకువస్తామని తెలిపారు. అయితే.. ఆ యువకుల నిర్ణయాన్ని పలువురు జనసైనికుల ప్రశంసించారు. అంతేకాకుండా మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే.. మరో పక్క.. పవన్‌ కళ్యాణ్‌ మాల దీక్ష వేసుకోవడం ఏంటని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version