బీజేపీకి వస్తున్న స్పందన చూడలేకే దాడులు : కిషన్‌ రెడ్డి

-

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రారంభించిన మూడో దశ ప్రజా సంగ్రామ యాత్ర ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ జనగామ జిల్లాలోని దేవరుప్పల పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నేతలపై రాళ్లదాడి చేశారు. అయితే ఈఘటనపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతున్నందునే ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు కిషన్ రెడ్డి. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు మంచివి కావన్న ఆయన.. ఎన్ని దాడులు చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కేసీఆర్ కుటుంబ పాలనను ప్రజలు అంతం చేస్తారని అన్నారు. రాష్ట్ర పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తుంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత వారికి లేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ నడుస్తోందన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ మరో ఐదారు నెలలు మాత్రమే ఉంటుందని అన్నారు. ఆరు నెలల్లో తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version