శ్రీశైలం మల్లి కార్జునిడిని దర్శించుకోనేవాళ్ళు వీటిని తప్పక తెలుసుకోవాలి..

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సుందరమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పర్వత ప్రాంతం శ్రీశైలం. కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం పట్టణం పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడి జనాభా 10 వేల కంటే తక్కువగా ఉంటుంది. సనాతన హిందూ మత సాంప్రదాయాలకు, సంస్కృతికి ఈ ప్రాంతం ఒక చిహ్నం. శ్రీశైలం పర్యటనకు ప్రతి ఏటా దేశ విదేశీ టూరిస్టులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు ప్రముఖ పర్యాటక కేంద్రంగానూ శ్రీశైలంకు ప్రత్యేక గుర్తింపు ఉంది..కర్నూల్ విమానాశ్రయం సమీపంలో ఈ ఆలయం ఉంది.

ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడల నుంచి అన్ని వేళలా బస్సు రవాణా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో శ్రీశైలం పర్యటన ఎంతో మనోహరంగా అనిపిస్తుంది..శ్రీశైలంకు వెళ్ళాలని అనుకోనేవాల్లు అక్కడ ఉండే ప్రముఖ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..నల్లమల కొండలపై ఉన్న శ్రీశైల మల్లిఖార్జున ఆలయం ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ పూజలందుకుంటున్న మల్లిఖార్జునుడి లింగ రూపం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన భ్రమరాంబిక అమ్మవారు కూడా మల్లిఖార్జునుడి సన్నిధికి సమీపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. కార్తీక మాసం సమయంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.మహా శివరాత్రినాడు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు ఎక్కడేక్కడి నుంచో వస్తారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 జిల్లాల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమల కొండలు, లోయలు, ప్రకృతి అందాల మధ్య టైగర్ రిజర్వ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. పట్టు మొక్కలు, టేకు చెట్లు వంటి విభిన్న రకాల వృక్ష జాలంతో పాటు బెంగాల్ టైగర్, ఏనుగులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు వంటి అనేక రకాల జంతు జాతులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటిని సందర్శించేందుకు జంగిల్ సఫారీ అందుబాటులో ఉంటుంది. పర్యటకులు ఎక్కువ సమయం అక్కడ గడుపుతారు..

కృష్ణానది గుండా బోటింగ్ ద్వారా అక్కమహాదేవి గుహలకు చేరుకోవచ్చు. మార్గమధ్యంలో దట్టమైన అడవులు, పర్వతాల యొక్క అందమైన దృశ్యాలను మీరు కనుగొనవచ్చు. ఇక్కడికి ప్రయాణం మీకు ఓ సాహసోపేత అనుభూతిని అందిస్తుంది. కన్నడ ప్రాంతానికి చెందిన కవయిత్రి అక్కమహాదేవి శివుణ్ణి తన భర్తగా భావించి ఇక్కడ తపస్సు చేసినందున ఈ ప్రదేశానికి అక్కమహాదేవి గుహలు అని పేరు స్థిరపడినట్లు చెబుతారు. ఈ గుహల్లో ఓ శివలింగాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు..అక్కడ చూసే ప్రదేశాల్లొ ఇది కూడా ఒక్కటి.ఆలయానికి సమీపంలోని లోయలో పాతాళ గంగ నది ఉంటుంది. పాపాలను పోగొట్టే పరమ పవిత్ర ప్రదేశంగా భక్తులు దీనిని భావిస్తారు. వనమూలికలతో నిండిన ఈ నీటికి అనేక రోగాలను పారద్రోలే శక్తి ఉందని చెబుతారు.

శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఎంతో మహిమ గల ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం. శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది..అక్కడికి కాలి నడకన వెళ్ళే వారికి సరదాగా ఉంటుంది..డ్యామ్ కూడా ఉంది.. ఇది అది అని కాకుండా అక్కడ అడుగడున ఎంతో రమణీయంగా ఉంటుంది.. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ కు వెళితే అక్కడకు వెళ్ళి మల్లికార్జునుడిని దర్శించుకొని రండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version