బన్నీ కాళ్ళు మొక్కుపోతే… పుష్ప 2 అడ్డుకుంటాం… జనసేన వార్నింగ్

-

Janasena Leader Ramesh Babu warns allu arjun : బన్నీ కాళ్ళు మొక్కుపోతే… పుష్ప 2 అడ్డుకుంటామని… జనసేన వార్నింగ్ ఇచ్చింది.  టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వర్సెస్ జనసేన పార్టీ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మొన్న బొలిశెట్టి శ్రీనివాస్… అల్లు అర్జున్ పై వివాదాస్పద కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కు అసలు ఫ్యాన్స్ లేరంటూ చురకలు అంటించారు బొలిశెట్టి శ్రీనివాస్. అయితే తాజాగా మరో జనసేన నేత చలమ శెట్టి రమేష్… అల్లు అర్జున్ పై హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ సంస్కారహీనుడని ధ్వజమెత్తారు రమేష్.

Janasena Leader Ramesh Babu warns allu arjun over pushpa 2

చిరంజీవి భావితరాలకు ఆదర్శ ప్రియుడా అంటూ కొనియాడారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి నువ్వు నేర్చుకునే సంస్కారం ఏంటి అంటూ నిలదీశారు. ఆ కుటుంబం పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన తతంగంలో… పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబాబు కాళ్లు కడిగి ఆ నీటిని ఆయన నెత్తి పైన చల్లుకోవాలని అల్లు అర్జున్ పై మండిపడ్డారు. అప్పుడే పుష్ప 2 సినిమాను తమ నియోజకవర్గంలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. లేకపోతే పుష్ప సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news