జనవరి 02 శనివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

మేష రాశి:ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి. ఈరోజు విలువైన వస్తువులను ఎవరికి ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు వస్తు వాహనాల కొనుగోలుకు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.

 

వృషభ రాశి:అప్పుల బాధ తీరుతుంది !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి సఖ్యతగా ఉంటారు. ఈరోజు పెద్ద వారి మాటలను సూచనలను పాటిస్తారు. ఈరోజు అప్పుల బాధ తీరుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. ఈరోజు విద్యార్థులకు పోటీ పరీక్షలకు బాగా అనుకూలిస్తుంది. ఈ రోజు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు వివాహ నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీకామాక్షి దేవి స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

మిధున రాశి:ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు !

నేడు ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ మాట జారడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణా లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు ఇతరులు చెప్పిన మాటలు నమ్మకుండా ఉండటం మంచిది. మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారం లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు శ్రీహనుమాన్ చాలీసా పారాయణం తెలుసుకోండి.

 

కర్కాటక రాశి:పోటీపరీక్షల్లో విజయం !

ఈ రోజంతా బాగుంటుంది. ఈరోజు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులను పొందే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు పోగొట్టుకున్నాను డబ్బుని ఈ రోజు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది. ఈరోజు సకాలంలో నిద్రాహారాలు తీసుకుంటారు. ఈ రోజు ఏ పని చేసినా కలిసి వస్తుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

సింహరాశి:ఈరోజు కొంచం కష్టంగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు పెద్దవారిని గౌరవించడం, పెద్ద వారి మాటలను పాటించడం మంచిది. ఈ రోజు ఎవరు ఏం చెప్పినా నమ్మకుండా ఉండడం మంచిది. చెప్పుడు మాటలకు మోసపోయే అవకాశం ఉంది. ఈరోజు కోపానికి,  తొందరపాటుతనానికి  దూరంగా ఉండటం మంచిది లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు ఎవరితో అయినా తక్కువ మాట్లాడడం మంచిది. సమయానుకూలంగా ఉండటం మంచిది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టం జరుగుతుంది.

పరిహారాలు: ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు లాభాలు వస్తాయి !

ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, సంతోషాన్ని కల్పిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు.  ఈరోజు ఇంటి స్థలాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. పట్టుదలతో అనుకున్న పని పూర్తి చేస్తారు. సంతోషాన్ని పొందుతారు.

పరిహారాలు: ఈరోజు శ్రీవేంకటేశ్వర స్వామి అష్టాక్షరి పారాయణం చేసుకోండి శుభ కారంగ ఉంటుంది.

 

 తులారాశి:ఈరోజు అందర్నీ ఆకట్టుకుంటారు !

ఈరోజు అంతా అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఈరోజు వివాహాది శుభకార్యాలు నిశ్చయం చేసుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు కలుగుతాయి. ఈ రోజు సంపూర్ణ  ఆరోగ్యాన్ని పొందుతారు. ఈరోజు సన్నిహితులను, మిత్రులను, బంధువులను కలుసుకుని ఆనందంగా వుంటారు. ఈరోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణతను పొందుతారు. ఈరోజు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు.

 పరిహారాలు: ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

.

వృశ్చిక రాశి:ఈరోజు అనుకూలంగా వుంటుంది !

ఈరోజు బాగుంటుంది. వ్యాపారస్థులకు బాగా అనుకూలమైన రోజు. ఈరోజు కుటుంబ సభ్యులతో సంఖ్యతగా ఉంటారు. ఈరోజు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు మంచి రోజు. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు.

పరిహారాలు: ఈరోజు శ్రీలక్ష్మి అష్టోత్తర పారాయణం చేసుకోండి.

 

 ధనస్సురాశి:ఈరోజు జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు విద్యార్థులు బాగా కష్టపడి చదువు మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. ఈరోజు వ్యాపారస్తులు వ్యాపారం లో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకొండి. ఈరోజు పెద్ద వారి మాటలను సూచనలను గౌరవించండి.

పరిహారాలు:  శ్రీహనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

మకర రాశి:ఈరోజు ప్రయాణాలకు అనుకూలం !

ఈ రోజంతా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు, బాగా కష్టపడి చదువుకుంటారు. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఇంతకు ముందు ఇచ్చిన అప్పులు ఈరోజు తిరిగి పొందుతారు. భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈరోజు సువర్ణ ఆభరణాలను, వాహనాలు కొనుగోలు చేస్తారు.  ఈరోజు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈరోజు అస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఉద్యోగాలలో అనుకూలత. ఈరోజు విజయం సాధిస్తారు. ఈరోజు శుభ కరంగా ఉంటుంది.

పరిహారాలు: ఈరోజు శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

కుంభరాశి:ఈరోజు లాభం చేకూరుతుంది !

ఈరోజు ఆనందంగా ఉంటారు. ఈరోజు వ్యాపారాల్లో లాభం. పాతబాకీలు వసూలవుతాయి. రుణ బాధలు నుంచి బయట పడతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పోగొట్టుకున్న దానాని పొందుతారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈరోజు సుఖంగా, సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ రోజు విందు వినోదాల్లో పాల్గొంటారు.

పరిహారాలు: ఈరోజు శ్రీరామ జయ రామ జయజయ రామ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి.

 

మీనరాశి:ఈరోజు ఉద్యోగాల్లో అనుకూలత !

ఈరోజు దైవ దర్శనం చేసుకుంటారు. ఈరోజు శత్రువులు వారి తప్పులు తెలుసుకొని మంచిగా మారుతారు. ఈరోజు ఉద్యోగాల్లో అనుకూలత. కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్నిస్తుంది. ఈరోజు మీ వాక్చాతుర్యం తో అందర్నీ ఆకటుకుంతరు. ఈరోజు వ్యాపారంలో అనుకూలత, లాభం కలుగుతుంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉంటారు. ఈ రోజు ప్రశాంతంగా గడుపుతారు. ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారాలు: ఈరోజు శ్రీదుర్గా సూక్తం పారాయణం చేసుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news