కిన్నెరసాని గ్లింప్స్: వెలుతురు కోసం వెతుకుతున్న మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్.

-

విజేత సినిమాతో హీరోగా మారిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్, ఆ తర్వాత తన రెండవ చిత్రంగా సూపర్ మచ్చిని తీసుకురాబోతున్నాడూ. సూపర్ మచ్చి చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఐతే తాజాగా కళ్యాణ్ దేవ్, మరో చిత్రాన్ని ఒప్పుకున్నాడు. కిన్నెరసాని పేరుతో రూపొందుతున్న ఈ సినిమా నుండి నూతన సంవత్సర వేడుకగా గ్లింప్స్ వీడియో రిలీజైంది. నిమిషం నిడివి గల ఈ వీడియోలో కొమ్మ సందుల్లో నుండి సూర్యుడిని చూస్తున్న కళ్యాణ్ దేవ్, సూర్యుడు కిందకి దిగి వెళ్ళిపోతుంటే బాధపడుతూ చూస్తున్నాడు.

బ్యాగ్రౌండ్ లో వినిపించిన సూర్యుడికి కనిపించని నాలోని చితిమంటలే అన్న పాట ఆకట్టుకుంది. అశ్వద్ధామ సినిమాకి దర్శకత్వం వహించిన రమణ్ తేజ్, కిన్నెర సాని సినిమాని డైరెక్ట్ చేసాడు. చిన్నపాటి గ్లింప్స్ వీడియో పెద్దపాటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మహతి స్వర సాగర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి హైలైట్ గా నిలవనుందని తెలుస్తుంది. ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news