బ్యాంక్ కస్టమర్స్ బ్యాంక్ సెలవలు గురించి ముందే తెలుసుకుంటే అవసరమైన పనులు పూర్తి చేసుకోచ్చు. 2022 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఆ సేవలని కస్టమర్స్ ముందే తెలుసుకుని పనులని పూర్తి చేసుకోవడం మంచిది.
2022 జనవరిలో పలు నగరాల్లో పలు తేదీలలో బ్యాంకులు మూతపడతాయని అన్నారు. అయితే మరి ఏయే రోజులు బ్యాంకులు సెలవులో చూద్దాం. మొత్తం మూడు క్యాటగిరీల్లో రిజర్వు బ్యాంకు సేవలని ఇస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద హాలిడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, బ్యాంకుల అకౌంట్స్ క్లోజింగ్ సందర్భంగా హాలిడేలను ఇస్తారు. ఇక సేవల విషయానికి వస్తే..
జనవరి 1 : న్యూ ఇయర్ సందర్భంగా ఐజ్వాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్‌లలో బ్యాంకులలో సెలవులు.
జనవరి 3: న్యూ ఇయర్, లోసూంగ్ సెలబ్రేషన్స్ కోసం ఐజ్వాల్, గ్యాంగ్‌టక్‌లలో బ్యాంకులు సెలవు.
జనవరి 4: లోసూంగ్ సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చెయ్యవు.
జనవరి 11: మిషనరీ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులుకి సెలవు.
జనవరి 12: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోల్‌కతాలో సెలవు.
జనవరి 14: మకర సంక్రాంతి, పొంగల్ సందర్భంగా అహ్మదాబాద్, చెన్నైలలో బ్యాంకులు పని చెయ్యవు.
జనవరి 15: సంక్రాంతి పండుగ, సంక్రాంతి, పొంగల్, తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులు పని చెయ్యవు.
జవనరి 18: తైపూసం సందర్భంగా చెన్నైలో బ్యాంకులు పని చెయ్యవు.
జనవరి 26 : అగర్తల, భోపాల్, భువనేశ్వర్, చండీఘర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కొచ్చి, శ్రీనగర్‌లను మినహాయించి దేశమంతా రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులుకి సెలవు.