ఇండియా శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రునిపైకి పంపించిన చంద్రయాన్ 3 ను సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. దేశం మాత్రమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఈ ప్రాజెక్ట్ ను పొగుడుతోంది. చంద్రునిపై కాలు మోపి అక్కడి చిత్రాలను కూడా రాకెట్ పంపించింది. ఇక ఈ సక్సెస్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుండగానే మరో మహత్తర ప్రయోగానికి తెరలేపనున్నట్లు తెలుస్తోంది. ఇండియా మరియు జపాన్ దేశాలు కలిసి చంద్రయాన్ 4 ప్రాజెక్ట్ ను చేయనున్నారని జపాన్ కు చెందిన స్పేస్ ఇంజనీర్ టోబి లి ప్రకటించారు. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే జాబిల్లిపై మంచురూపంలో ఉన్న నీరు మరియు ఇతర మూలకాల పరిస్థితిపై పరిశోధనలు జరుగుతాయని టోబి లి వివరించారు. కాగా ఈ ప్రయోగానికి 2026 వ సంవత్సరాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు, ఇంకా భవిష్యత్తులోనూ ఇలాంటి ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయని టోబి లి చెప్పారు.
కాగా ఈ ప్రయోగం జపాన్ కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా సాగుతుందని తెలిపారు. ఈ ప్రయోగం కూడా సక్సెస్ కావాలని ఆశిద్దాం.