మాస్క్ లేకుండా రోడ్డు పైకి…డబ్బులిచ్చి మాస్క్ కొనుక్కోమన్న పోలీస్ అధికారి

-

మాస్క్ లు పెట్టుకోకుండా బయటకు రావద్దు నాయనా అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం అభ్యర్ధించినప్పటికీ ఎవరూ కూడా వినిపించుకోవడం లేదు. ప్రపంచ దేశాలను అల్లడిస్తున్న కరోనా మహమ్మారి ని తరిమి కొట్టాలి అంటే ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్కులు ధరించాలి అంటూ ప్రతి ఒక్కరూ సూచిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా ప్రవర్తిస్తూనే ఉన్నారు. భారత దేశంలో కూడా 6 వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ముఖాలకు మాస్కులు ధరించాలి,చేతులు పరిశుభ్రంగా కడగాలి అని వైద్యులు ఎన్ని సూచనలు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా మాస్కు లు ధరించకుండానే బయటకు వచ్చి యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. అయితే ఇలాంటి ఆకతాయిలకు జార్ఖండ్ పోలీసులు బుద్ధి చెప్పారు. మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వచ్చిన అతనిని ఓ పోలీస్ అధికారి అడ్డగించి అతనితో మాట్లాడారు. మాస్క్ లేకుండా బయటకు వచ్చినందుకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం మాస్క్ కొనుక్కోవడానికి తన జేబులోంచి డబ్బులు ఇచ్చి పంపారు. ఈ ఘటన గొడ్డా ప్రాంతంలో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా,20 వేల మందికి పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

ప్రపంచ దేశాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా మృతుల సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.. చైనా,ఇటలీ ల తరువాత అమెరికా లో అంత తీవ్ర స్థాయిలో కరోనా మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 1000 మందికి పైగాకరోనా కారణంగా మృతిచెందినట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news