కరోనా ఎఫెక్ట్ షార్ట్,టీ షర్టు తో సూపర్ మార్కెట్ లో దర్శనమిచ్చిన బన్నీ

-

కరోనా వైరస్ తో సెలబ్రిటీలు సైతం ఇంటి పనులతో బిజీ అయిపోతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడం తో సినీ సెలబ్రిటీలు అందరూ కూడా ఇంటిలోనే ఖాళీ గా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రతి సెలబ్రిటీ కూడా ఇంటి పనులలో నిమగ్నమై ఉన్నారు. బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా సెలబ్రిటీలు ఇప్పుడు ఇంటికి సంబందించిన పనులు చేసుకుంటూ కుటుంబసభ్యులకు సహాయపడుతూ ఉన్నారు. తాజాగా అల్లుఅర్జున్ కూడా తన ఇంటి కోసం సరుకులు కొనడానికి కామన్ మ్యాన్ లాగే సూపర్ మార్కెట్ కు వచ్చాడు. మాస్క్ వేసుకొని,షార్ట్,టీ షర్ట్ తో బయట సూపర్ మార్కెట్ కు వచ్చి ఇంటికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అయితే మాస్క్ వేసుకోవడం తో ఆయన్ని చూసి కొందరు గుర్తు పట్టగా,కొందరు అయితే బన్నీ కాదేమో అని లైట్ తీసుకున్నారట. అల్లు అర్జున్ అల సూపర్ మార్కెట్‌లో సరుకులు కొంటున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు పెద్దపెద్ద వాళ్లకే తప్పట్లేదు.. మనమెంత అనుకుంటున్నారు. పెద్దోడికైనా.. పేదోడికైనా అవసరం అవసరమే కదా. అందుకే సెలబ్రిటీలకు అయినా ఇంటి పనులు చేసుకోవడం తప్పడం లేదు. లాక్ డౌన్ తో షూటింగ్ లు అన్ని బంద్ అవ్వడం తో బన్నీ ఒక్కడే కాదు.. స్టార్ హీరోలందరూ కూడా తమకు కావాల్సిన సరకులతో పాటు తమ ఇంటి పనులు కూడా స్వయంగా తామే చేసుకుంటున్నారు. ఇటీవల వెన్నెల కిషోర్ ఇల్లు ఉడుచుకుంటూ వీడియో షేర్ చేయగా, జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా వంట చేసుకుంటూ వీడియో పోస్ట్ చేసింది.

అలానే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా మొన్న గిన్నెలు తోముతూ ఒక వీడియో పోస్ట్ చేయగా,తాజాగా చీపురు పట్టి ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు బన్నీ ఏమో ఇలా సరుకులు కొంటూ ఫోటోకు పోజిచ్చాడు. మొత్తానికి కరోనా వైరస్ కారణంగా అంతా ఇలా ఇంటి పనులతో బిజీ అయిపోయారన్నమాట. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బన్నీ. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మళ్లీ మొదలు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news