జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది : శరత్ పవార్

-

ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శలతో ధ్వజమెత్తారు. భారత మాజీ ప్రధానులు దేశాభివృద్ధి కోసం పనిచేశారని, కానీ ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాకుండా గడిచిన 10సంవత్సరాల నుంచి తన ప్రభుత్వం ప్రజలకు చేసిన దాని గురించి మాట్లాడ్డంలేదని మండిపడ్డారు .

ఎన్నికల ప్రచారం సందర్భంగా అమరావతిలో జరిగిన ప్రచార సభలో పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని ప్రశ్నించలేమని , అలాగే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ నవ భారతం కోసం కృషి చేశారు అని అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది. దాన్నెవరూ మర్చిపోలేరు అని వ్యాఖ్యానించారు.కొంతమంది బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చడం గురించి బహిరంగంగా మాట్లాడారని, ప్రధాని మోడీ కూడా ప్రజల్లో భయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news