తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ బారిన పడి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెళ్ళి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ యాదగిరి రెండో కుమారుడు రాహుల్ (24) ఇంటర్ వరకు చదివి ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా రాహుల్ మద్యం తాగడం, క్రికెట్ బెట్టింగులు వేయడానికి బానిసగా మారాడు, అప్పు చేసి ఐపీఎల్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టగా, రూ.4 లక్షలు నష్ట పోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు రాహుల్.