“జయమ్మ పంచాయతీ” టీజర్ విడుదల.. డైలాగ్ లతో అదరగొట్టిన సుమ

యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. యాంకర్ గానే కాకుండా సినిమాల్లోనూ భిన్న పాత్రలు చేసే సత్తా ఉన్న నటి సుమ. అయితే ప్రస్తుతం విజయ దర్శకత్వంలో యాంకర్ సుమ జయమ్మ పంచాయతీ అనే సినిమా చేస్తోంది.  వెన్నెల క్రియేషన్స్ బ్యాన్‌ర్‌ పై ప్రొడక్షన్‌ నెం. 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా కు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో యాంకర్ సుమ కీలక పాత్ర పోషిస్తుండగా.. ఎం ఎం కీరవాణి.. సంగీత స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రాగా.. తాజాగా మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర బృందం. టాలీవుడ్ యంగ్ హీరో రానా చేతులమీదుగా జయమ్మ పంచాయతీ టీజర్ ను విడుదల చేయించారు. ఇంకా ఈ టీజర్ లో యాంకర్ సుమ … ఎప్పటిలాగే తన యాక్టింగ్ తో అదరగొట్టారు. పూర్వకాలపు సామెతలు చెబుతూ అందరినీ అలరించారు. ఇక ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.