మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసు.. దేశంలో 37కు చేరిన కేసుల సంఖ్య..

-

ఒమి క్రాన్ అనే కొత్త వేరియంట్ మన ఇండియా ను వణికిస్తోంది. ఇప్పటికే అరవై ఆరు దేశాలకు పాకిన ఈ కొత్త వేరియంట్…. మన ఇండియాలోను క్రమక్రమంగా పెరుగుతోంది. ఇక తాజాగా… ఇండియాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. మహారాష్ట్ర లోని నాగపూర్ పట్టణంలో తొలి కేసు నమోదైంది. 40 సంవత్సరాల వ్యక్తికి ఈ కొత్త వేరియంట్ సోకినట్లు.. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ న్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

దీంతో మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 18 కి చేరింది. మిగతా రాష్ట్రాల్లో కేసులను పరిశీలిస్తే, కర్ణాటకలో 3, రాజస్థాన్ 9, ఢిల్లీ 2, ఛండీగడ్ 1, గుజరాత్ 3, ఏపీ 1 కేసులు నమోదయ్యాయి.

ఇక ఈ కొత్త వేర్ యాంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కేంద్ర అ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆదిలోనే ఈ వేరియంట్ ను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూను అవసరమైతే అమలు చేయాలని రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news