అంగరంగ వైభవంగా జ‌రిగిన జ‌య‌సుధ కుమారుడి వివాహం.. వైర‌ల్ అవుతున్న ఫోటోలు..!

-

సీనియర్ నటి జయసుధ ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎందరో అగ్ర నటులతో నటించిన అనుభవం ఆమె సొంతం. జయసుధ సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా నటించారు. అయితే తాజాగా జయసుధ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. జ‌య‌సుధ‌ మొదటి కుమారుడి వివాహం నేడు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. జయసుధ, నితిన్ కపూర్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు నిహార్ వివాహం ఆ రోజే జ‌రిగింది. ఢిల్లీకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అమృత కౌర్ తో నిహార్ వివాహం జరగింది.

ఈ వేడుక‌లో సీనియర్ నటీమణులు జయ ప్రదా, రాధిక మరియు ఇతర సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఇక రిసెప్షన్ కూడా అతి త్వరలో హైదరాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. ప్ర‌స్తుతం నిహార వివాహానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, నిహార్ ప్రస్తుతం బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్నాడు. ఇక గతంలో జయసుధ కాంగ్రెస్ నాయకురాలిగా పనిచేశారు. ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు జయసుధ, నిహార్ ఇద్దరూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news