జయదేవ్ ఉనాద్కట్ సంచలనం చేసేశాడు. ఇటీవలే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జయదేవ్ ఉనాద్కట్..రంజీలోనూ టాప్‌లేపేశాడు. జయదేవ్ ఉనద్కట్ రంజి ట్రోఫీ టోర్నీలో సంచలనం సృష్టించాడు. ఢిల్లీ తో మ్యాచ్ లో వేసిన మొదటి ఓవర్ లోనే మూడు వికెట్లు కూల్చి హ్యాట్రిక్ నమోదు చేశాడు ఈ సౌరాష్ట్ర కెప్టెన్.
మూడు, నాలుగు, ఐదో బంతికి వరుసగా ఢిల్లీ ఓపెనర్ ద్రువ్ షోరే, వన్ డౌన్ బ్యాటర్ వైభవ్ రావల్ సహా యష్ దుల్ లను పెవిలియన్ కు పంపాడు. ముగ్గురిని డక్ అవుట్ చేశాడు. కాగా రంజిత్ ట్రోఫీ చరిత్రలో తొలి ఓవర్ లోనే ఇలా హ్యాట్రిక్ నమోదు కావడం ఇదే తొలిసారి.
ఇలా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న జయదేవ్, రెండో ఓవర్ లోను విజృంభించాడు. వెంటనే మరో రెండు వికెట్లు తీశాడు. ఢిల్లీ బ్యాటర్లు లలిత్ యాదవ్, లక్ష్యయ్ తరేజాలను అవుట్ చేశాడు. తద్వారా, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 21వ సారి, ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కూల్చిన ఘనత సాధించాడు ఉనద్కట్.