బాబు ‘హత్యలు’..జగన్ ప్రశ్నలకు సమాధానలేవీ!

-

ఇటీవల చంద్రబాబు సభల్లో వరుసగా తొక్కిసలాట జరిగి..11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కందుకూరు సభలో 8 మంది చనిపోగా, గుంటూరు సభలో ముగ్గురు చనిపోయారు. ఇక బాబు ప్రచార పిచ్చి వల్లే ఈ ఘటనలు జరిగాయని వైసీపీ అంటుంది..దీని వెనుక వైసీపీ కుట్ర ఉందని టీడీపీ ఆరోపిస్తుంది. ఇదే సమయంలో రోడ్లపై సభలు, ర్యాలీలు పెట్టకూడదని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తాజా ఘటనలపై జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు..నేడు రాజమండ్రిలో పింఛన్ పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్టీఆర్‌ను చంపేసి కుర్చీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తాడని, ఫోటోషూట్, డ్రామాలే చంద్రబాబు నైజాం. గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంద్రబాబు చంపేశాడని ఫైర్ అయ్యారు. మనుషులను చంద్రబాబు చంపేసిన సరే.. ఈనాడు, ఏబీఎన్, టీవీ 5 దత్తపుత్రుడు అడగరు..మాట్లాడరు.. ప్రశ్నించరు..అంటూ జగన్ విరుచుకుపడ్డారు.

అయితే జగన్ అడిగిన ప్రశ్నలకు టీడీపీ మీడియా, పవన్ సమాధానం చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఇంతమంది చనిపోయిన పవన్ ఎందుకు నోరు మెదపడం లేదు..అసలు బాబు పేరు ఎత్తడం లేదు..తప్పుబట్టడం లేదని అడుగుతున్నారు. బాబు మనిషి కాబట్టే పవన్ విమర్శించడం లేదని అంటున్నారు.

ఇక గోదావరిలో బోటు ప్రమాదం జరిగి..30 మందిపైనే చనిపోతే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆక్సిజన్ అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో ఎంతమంది ప్రాణాలు విడిచారో తెలుసని..ప్రమాదశావత్తు జరిగిన వాటిని రాజకీయం చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకోవడంలో వైసీపీ ముందు ఉంటుందని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఇలా రెండు పార్టీలు కలిసి శవ రాజకీయం చేయడంలో బిజీగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news