వాహన అక్రమాల విషయంలో జైలుకి వెళ్లి ఆ తర్వాత జైలు నుంచి బయటకు బెయిల్ పై వచ్చిన అనంతపురం టీడీపీ సీనియర్ నేత జేసి ప్రభాకర్ రెడ్డి వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ట్రాఫిక్ సిఐకి ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారింది. నిన్న జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన మాట్లాడుతూ కాస్త దూకుడుగా వ్యాఖ్యలు చేసారు ఆయన.
సిఐ అంతు చూస్తా అని ఆయన వ్యాఖ్యానించారు. సిఐ ట్రాఫిక్ లో ఉండగా ఆయనను బెదిరించారు. దీనిపై ఇప్పుడు మరో కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. కాగా నిన్న ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయన కుమారుడు అష్మిత్ రెడ్డి కూడా జైలు నుంచి విడుదల అయ్యారు. వీరికి కోర్ట్ బెయిల్ మంజూరు చేయగా జేసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వెళ్లి విడిపించి తీసుకొచ్చారు.