రైతును మించిన గురువులేడు జేడీ కామెంట్స్..!

రావులపాలెం అంతరాష్ట్ర అరటి మార్కెట్ కు సిబిఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ విచ్చేసారు. అరటి గెలలు అమ్ముకుంటున్న రైతులను కష్టాల‌ను జేడీ లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకున్నారు. రైతు నాయకుడంటూ లక్ష్మీనారాయణను చూసి రైతులంతా నినాదాలు చేసారు. అనంత‌రం జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..ఈరోజు ఉపాధ్యాయదినోత్సవం అని రైతును మించిన గురువు లేడని వ్యాఖ్యానించారు.

తాను 12 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తూ రైతులను కలసి వారి కష్టాలను తెలుసుకుంటున్నానని చెప్పారు. అరటి రైతుల ఆదాయం పెరగాలంటే ప్రభుత్వం వెదురు కర్రలు, ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలని జేడీ డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ 12 గంటలకు పెంచాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా యాభై శాతం కూలీలు రైతుల పొలాల్లో పనిచేయాలని జేడీ వ్యాఖ్యానించారు. అరటి రైతుల ఆదాయం పెరిగే మార్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.