పీసీసీ పదవి గురించి క్లారిటీ ఇచ్చిన జీవన్ రెడ్డి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారంటూ వార్తలు వస్తున్న క్రమంలో ఈ విషయం మీద ఆయనను మీడియా పలకరించగా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పీసీసీ పదవి వచ్చినా సామాన్య కార్యకర్త గానే పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. నాకు ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్ష పదవి ఖరారు అయిందని ఎలాంటి సమాచారం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నాకు సముచిత స్థానం కల్పించిందని ఇక ముందు కూడా కల్పిస్తుందని నమ్ముతున్నామని అన్నారు.

పదవి వచ్చినా రాకపోయినా నేను పార్టీ బలోపేతం కోసం సామాన్య కార్యకర్త గానే పని చేస్తానని అన్నారు. భవిష్యత్తు మాత్రం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఇక పత్రికల్లో,టీవీల్లో వస్తున్నది మాత్రం ఊహాజనితం మాత్రమే…నాకు మాత్రం పదవి గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు ఏ క్షణాన అయినా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష్యుడిని ప్రకటించే అవకాశం ఉంది.