తెలంగాణ రాజకీయాల్లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఒకరిద్దరు అధికారికంగా చేరిపోగా మరికొందరు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉంటూనే హైకోర్టు ఆదేశాలతో ఎక్కడ తమపై వేటు పడుతుందేమోనని తామింకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని కవర్ చేస్తున్నారు.
ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇప్పటికే కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారు. బయటకు మాత్రం తానింకా గులాబీ ఎమ్మెల్యేనే అని చెప్పుకుంటున్నారు. అయితే, జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగిరెడ్డి హత్యతో ఆయన కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారు. గులాబీ పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కవిత, కేటీఆర్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘రాజకీయం అనేది ఇస్తే వచ్చేది కాదు..
చాలామందికి వారసులు ఉన్నారు కానీ ఎవరికి కలిసి రాలే.. కానీ, KCRకి కలిసి వచ్చింది.. వారసత్వం KCR ఇస్తే వచ్చింది కాదు.. KTR, కవిత వాళ్ళు ఇంటిలిజెంట్స్ ఎవరు అవునన్నా కాదన్న’ అని కీలక వ్యాఖ్యలు చేయడంతో.. త్వరలోనే ఆయన బీఆర్ఎస్లోకి జంప్ అవుతారని ఊహగానాలు వినిపిస్తున్నాయి.