26 ఏళ్ల పాటు విమాన సేవలు అందించిన జెట్ ఎయిర్వేస్ శకం ముగిసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి జెట్ ఎయిర్వేస్ తన సేవలను పూర్తిగా నిలిపివేసింది. తన కార్యకలాపాలు అన్నింటినీ జెట్ ఎయిర్వేస్ నిలిపి వేయడంతో ఆ సంస్థ లో పని చేస్తున్న 22 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అందులో 16 వేల మంది కంపెనీ డైరెక్ట్ ఉద్యోగులు కాగా మిగితా వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నవారు. జెట్ ఎయిర్వేస్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడం తో దాన్ని ఎవరైనా కొనుగోలు చేస్తేనే మళ్లీ అది పట్టాలకెక్కనుంది. సంస్థకు కావాల్సిన నిధులను సమకూర్చలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జెట్ ఎయిర్వేస్ కి వెల్లడించడంతో చేసేది లేక జెట్ ఎయిర్వేస్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపి వేసింది. డొమెస్టిక్ , ఇంటర్నేషనల్ విమాన సర్వీసులను నిలిపివేసింది. బుధవారం రాత్రి తన చివరి సర్వీస్ ను నడిపిన తర్వాత కంపెనీ షట్ డౌన్ అయింది.
జెట్ ఎయిర్వేస్ షట్ డౌన్… ప్రశ్నార్థకంగా 22 వేల మంది ఉద్యోగుల భవిష్యత్
-