బాలీవుడ్ సూపర్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. రోజుకో కాంట్రవర్శీతో ఈ ఫొటోషూట్ వార్త ఇంకా ఫ్రెష్ గా అందరి నోట్లో నానుతూ ఉంది. రణ్‌వీర్ ఫొటోలు షేర్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియా షేక్ అవుతూనే ఉంది. ఏ గ్రూప్ చూసినా.. ఏ మీమ్ పేజ్ చూసినా రణ్‌వీర్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. వీటిపై కొందరు నెగెటివ్ కామెంట్లు చేయగా మరికొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.
తాజాగా రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటోలపై బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ స్పందించింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను విలేకరులు ప్రశ్నించగా.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘అది ఒక కళాత్మక స్వేచ్ఛ. దానికోసం విమర్శించడం, విశ్లేషించడం సరైన పద్ధతి కాదు’ అని జాన్వీ పేర్కొంది. కాగా పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా రణ్‌వీర్ సింగ్ ఫొటోషూట్ చేసిన విషయం తెలిసిందే.
మరో బాలీవుడ్ నటి విద్యాబాలన్ సైతం రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో షూట్‌పై స్పందించింది. అతనికి మద్దతుగా నిలిచింది. ‘ఒకరి భావ ప్రకటనా స్వేచ్ఛను అరికట్టడానికి ప్రయత్నించడం అర్థరహితం. అవతలి వ్యక్తి చేసే పని మీకు నచ్చకపోతే కళ్లు మూసుకోండి. అంతే కానీ ఇంకో వ్యక్తిని మీరు నిర్దేశించలేరు. ఎందుకంటే అప్పుడు మీరు చేసే పని.. నాకు