ఈ డైరెక్టర్స్​ వెరీ స్పెషల్​.. ఒక్క చిత్రంతో మార్క్​.. వేల కోట్లకు అధిపతిగా!

-

ఆన్​ ది స్క్రీన్​ హీరో శాసిస్తే.. బిహైండ్​ ది స్క్రీన్​ డైరెక్టర్​ డిక్టేట్​ చేస్తాడు. మల్టీస్టారర్​, యాక్షన్​ థ్రిల్లర్, హారర్​, లవ్​స్టోరీ..​ ఇలా జోనర్​ ఏదైనా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తనదైన స్టైల్​లో తెరకెక్కించి ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఓ చిత్రం విజయం సాధించాలన్నా, డిజాస్టర్​ అవ్వాలన్నా అంతా అతడి చేతిలోనే ఉంటుంది.

ఎందుకంటే కథను తెరపై చూపించే విధానంలో తేడా వస్తే ఎంత మంచి కథ అయినా కంచికి చేరాల్సిందే. అయితే అలాంటి పెద్ద బాధ్యతను మోసి సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్లు ఉన్నారు. సింపుల్​ కథను కూడా తెరపై అద్భుతంగా చూపించి తమ ప్రతిభను చాటుకున్నారు. భారత చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక మార్క్​ను క్రియేట్​ చేసుకున్నారు. సినిమాకు సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ.. తన స్థాయిని పెంచుకుని ఇండియన్​ సినిమా ఇండస్ట్రీని ఏలే దిశగా ఎదిగారు. ఈ క్రమంలోనే తమ రెమ్యునరేషన్​ను కూడా భారీగా పెంచి రిచ్​ డైరెక్టర్స్​గా పేరు గాంచారు. వారెవరో తెలుసుకుందాం…

ఇండియన్​ డైరెక్టర్స్​ కా బాప్​.. కెరీర్‌లో ఒకటో, రెండో ఇండస్ట్రీ హిట్లుంటే టాప్‌ డైరెక్టర్‌ అంటారు. తీసినవన్నీ బ్లాక్‌బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లైతే ఆయన్నే టాలీవుడ్ ఇండస్ట్రీ కా బ్రాండ్​ అంబాసిడర్ జక్కన్న అని పిలుస్తారు. ఆయన తీసే ప్రతీ చిత్రం గ్రాండ్​గా ఉంటుంది. అయితే తన విజన్​ ఎలా ఉంటుందో ‘బాహుబలి’తో ప్రపంచమంతటికీ తెలియజేశారు. టాలీవుడ్‌ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారు. అప్పటి నుంచి మార్కెట్​లో రాజమౌళికి ప్రత్యేకస్థానం ఏర్పడింది. అంతేకాదు ప్రొడ్యూసర్​గా చిత్రాలను నిర్మిస్తున్నారు. ఆయన నెట్​ వర్త్​ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని సమాచారం. ఓ ప్రముఖ ఇంగ్లీష్ వెబ్​సైట్​ కథనం ప్రకారం.. ఇంతకీ రాజమౌళి ‘బాహుబలి’ ఫ్రాంచైజీకి ఎంత ఛార్జ్​ చేశారో తెలుసా?.. రూ.25 కోట్లు. ఇక లాభాల్లో షేర్లు కూడా తీసుకున్నారట. దీంతో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రధారులుగా ‘ఆర్​ఆర్​ఆర్’​ సినిమా లాభాల నుంచి 30 శాతం షేర్లు తీసుకున్నారట. ఇలా సినిమా టేకింగ్​లో ఎక్కడా తగ్గని రాజమౌళి రెమ్యునరేషన్​ విషయంలో కూడా తగ్గేదేలే అంటున్నారు.

మెసేజ్​ ఒరియెంటెడ్​కు కమర్షియల్ హంగులు​​.. భారీ బడ్జెట్​ సినిమాలకు కేరాఫ్​గా మారిన తొలి దక్షిణాది డైరెక్టర్​ శంకర్. ఇండియ‌న్ సినిమాల్లో త‌న‌కంటూ ఓ స్థానాన్ని ద‌క్కించుకున్నారు. మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాల‌కు భారీ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను అద్ది విజయాలను అందుకోవడం ఈయన ప్రత్యేకత​. ‘జెంటిల్​మెన్’​ సినిమాతో మొదలై ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’, ‘రోబో’ ఇలా ప్రతీ చిత్రాన్ని వైవిధ్యంగా తెరకెక్కించి ఇండస్ట్రీని మరో రేంజ్​కు తీసుకెళ్లారు. అయితే ఆయన భారీ స్థాయిలో రూపొందించిన గత రెండు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈయన ఆస్తి విలువ రూ.150 కోట్లు పైమాటే. కొన్ని ఇంగ్లీష్​ కథనాలు ప్రకారం ఈయన అత్యధికంగా ఒక్క సినిమాకు రూ.40కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట. ప్రస్తుతం శంకర్​.. ‘ఇండియన్​-2’, ‘ఆర్​సీ 15’​ చిత్రాలతో కమ్​బ్యాక్​ ఇచ్చి తనేంటో చూపించాలని అనుకుంటున్నారు.

ప్రేమకథలను మరింత అందంగా​.. ప్రేమ, కుటుంబ కథా చిత్రాలకు బాలీవుడ్​లో ప్రత్యేకస్థానం ఉంది. వాటిని మరింత అందంగా చూపించడంలో కరణ్​ జోహార్​ది అందవేసిన చేయి. కుచ్​కుచ్​ హోతా హై, కభీ కుషీ కభీ ఘమ్​, స్టూడెంట్​ ఆఫ్​ ద ఇయర్, మై నేమ్​ ఈజ్​ ఖాన్​ వంటి సూపర్​ హిట్​ చిత్రాలను అందించి ట్రెండ్​ సృష్టించారు. నిర్మాతగానూ ఎన్నో బడా చిత్రాలను నిర్మించి బాలీవుడ్​లో చెరగని ముద్ర వేశారు. ధర్మ ప్రొడక్షన్స్​, ధర్మ 2.0, ధర్మ కార్నర్​స్టోన్​ ఏజెన్సీ ఇలా మూడు సంస్థల ద్వారా ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈయనకు దాదాపు రూ.1450 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీలతో కరణ్‌ నిర్వహించిన చిట్‌చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ విశేష ఆదరణ పొందింది. ఆయనలో మంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా ఉన్నాడు.

రెండు దశాబ్దాలు.. ఇండస్ట్రీ హిట్​లు.. బాలీవుడ్ అగ్రదర్శకుల్లో సంజయ్​ లీలా భన్సాలీ ఒకరు. కథను తెరపై ఆయన చూపించే విధానం అద్భుతం. రెండు దశాబ్దాలుగా సూపర్​ హిట్​ డైరెక్టర్​గా కొనసాగుతున్నారు. హమ్​ దిల్​ దే చుకే సనమ్​, దేవదాస్​, రామ్​లీలా, బాజీరావ్​ మస్తాన్ వంటి ఇండస్ట్రీహిట్​లను తెరకెక్కించారు. చివరగా ఆయన రూపొందించిన పద్మావత్​(రూ.500 కోట్లు), గంగూబాయ్ కతియావాడి(రూ.100కోట్లు) మార్క్​ను అందుకున్నాయి. ఆయన ఆస్తి విలువ రూ.900 కోట్లు పైమాటే.

100 శాతం సక్సెస్​ రేట్​తో.. సామాజిక అంశాలే ఇతివృత్తం చేసుకొని మనసుకు హత్తుకునేలా చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణి. బాలీవుడ్‌లో విజయవంతమైన డైరెక్టర్లలో ఆయన ఒకరు. నూతన దర్శకులు ఆరాధించేవాళ్లలో రాజ్‌ కుమార్‌ హిరానీ తప్పకుండా ఉంటారు. చేసింది తక్కువ సినిమాలైనా 100 శాతం సక్సెస్‌ రేట్‌ ఘనత పొందారు. ఆయన సినిమాల్లో కథన శైలి, తెరకెక్కించిన విధానం, దృష్టికోణం భారతదేశ చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాయి. పైగా ప్రేక్షకులు, విమర్శుకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. ఈయన రూపొందించిన ప్రతి సినిమా బాక్సాఫీస్​ వద్ద రికార్డు సాధించాయి. ప్రస్తుతం ఆయన బాద్​షా షారుక్​తో ‘డంకీ’ సినిమా చేస్తున్నారు. ఈయన ఆస్తి రూ.1105కోట్లు అని ఇంగ్లీష్​ కథనాల్లో రాశారు. ఈయనకు 30కు పైగా అవార్డులను అందుకున్నారు. అందులో ఐదు జాతీయ అవార్డ్స్​ ఉన్నాయి.

ఇంకా పలువురు బాలీవుడ్​ దర్శకులు కూడా సరికొత్త చిత్రాలను అందించి ఓ ల్యాండ్​ మార్క్​ను క్రియేట్​ చేసుకున్నారు. వీరిలో ఫర్హాన్​ అక్తర్​, జోయా అక్తర్​, కబీర్​ ఖాన్​ కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version