రిలయన్స్ జియో రాకతో టెలికం రంగంలో పెను మార్పలు చోటుచేసుకున్నాయి. తక్కువ ధరకే డేటా ఆఫర్లు అందించడంతో వినియోగదారులు జియో బాట పట్టారు. ఈ క్రమంలోనే ఇతర టెలికం పోటీదారుల్లో కలవరం ఏర్పడింది. ఇక ఇప్పుడు జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుతో రాబోతుంది. జియో గిగా ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవను సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని ముఖేశ్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మిగిలిన టెలికాం రంగానికి ఎర్త్ పెట్టినట్లైంది
రిలయన్స్ జియో.. FTTH సర్వీసులో భాగంగా హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు, జియో గిగాఫైబర్ కనెక్షన్, ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ మరియు టీవీ సెట్-టాప్ బాక్స్‌తో వస్తుంది. జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా జియో ఫైబర్ కనెక్షన్ కొనుగోలు చేసే వారికి 4 కె ఎల్‌ఇడి టివి మరియు 4 కె సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ఇస్తామని కంపెనీ ప్రకటించింది. స్టాటింగ్‌లో ఎటువంటి ఛార్జీలు కూడా ఉండవు.
జియో ప్రివ్యూ ఆఫర్ కింద జియో గిగాఫైబర్ సర్వీసు పొందాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2వేల 500 చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో ఫైబర్ ఇప్పటికే 1.5 కోట్ల రిజిస్ట్రేషన్లను పొందింది. భారతదేశంలోని 1,600 పట్టణాల్లో 2 కోట్ల నివాసాలు, 1.5 కోట్ల వ్యాపార సంస్థలను కవర్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇంటి నుండి ఏ భారతీయ టెలికం నెట్ వర్క్‌లకు అయినా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కాలింగ్ టారిఫ్ కూడా తక్కువ ధరకే అందిస్తోంది.
జియో ఫైబర్ డేటా ప్లాన్ల ధరలు ఇవే :
– జియో ఫైబర్ డేటా ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి.
– కస్టమర్లు నెలకు రూ.700తో డేటా ప్లాన్ తీసుకుంటే.. 100Mbps హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
– ప్రీమియం యూజర్లు రూ.10వేల డేటా ప్లాన్ తీసుకుంటే.. 1Gbps హైస్పీడ్ డేటా యాక్సస్ చేసుకోవచ్చు.