ప్రపంచం ఇప్పుడు 5జి వైపు అడుగులు వేస్తుంది. చైనా, జపాన్ సహా అనేక దేశాలు ఇప్పుడు 5జి మొబైల్స్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ మొబైల్స్ ని భారత్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలను సంచలనకు వేదిక అయిన జియో చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ మేకర్ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు.
జియో సంస్థ ఆ సన్నాహకాల్లో ఉందని ఆయన ప్రకటించారు. 5జీ మొబైల్ సేవలకు సంబంధించి రిలయన్స్ జియో నెట్‌వర్క్ ఇప్పటికే సిద్దమైనట్టు వివరించారు. ఇప్పటికే ట్రాన్సిషన్ ఇండియా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తాలపత్ర చవక 5జీ స్మార్ట్‌ఫోన్లు తీసుకొచ్చే సత్తా ప్రస్తుతం జియోకే ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 2016లో 4జీ సర్వీసెస్‌తో రంగంలోకి దిగిన రిలయన్స్ జియో ఇప్పుడు అంచనాలకు అందని విధంగా దూసుకుపోతుంది.
ఒకసారి నెట్‌వర్క్‌ను చూసిన తర్వాత, రూ.15 వేల 5జీ స్మార్ట్‌ఫోన్‌పై జియో పెట్టుబడులు పెట్టె అవకాశం ఉందని, 2021 నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. మిగిలిన సంస్థలు ఈ పరిస్థితుల్లో ఆ సాహస౦ చేయలేవని పరిశీలకులు కూడా అంటున్నారు. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న జియో ఆ సాహస౦ చేసే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.