ఆండ్రాయిడ్‌, ఐఫోన్ల‌కు జియో మార్ట్ యాప్ వ‌చ్చేసింది.. ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌రలు..!

-

రిల‌య‌న్స్ రిటెయిల్‌ అండ్ జియో ప్లాట్‌ఫాంకు చెందిన జియో మార్ట్ ఇప్పుడు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై కూడా ల‌భిస్తోంది. ఈ మేర‌కు రిల‌య‌న్స్ ఈ యాప్‌ను ఆయా ప్లాట్‌ఫాంల‌పై విడుద‌ల చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని త‌మ ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు. ఇందులో ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌ర‌ల‌కే వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

జియోమార్ట్ సేవ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం వెబ్‌సైట్‌, వాట్సాప్‌ల‌లోనే వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉన్నాయి. ఇక యాప్‌లు రావ‌డంతో నేరుగా వాటి నుంచి వారు స‌రుకుల‌ను ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా 200కు పైగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఈ యాప్ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతానికి కేవ‌లం కిరాణా స‌రుకుల‌ను మాత్ర‌మే ఇందులో డెలివ‌రీ అందిస్తున్నారు. త్వ‌ర‌లో ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్యాష‌న్‌, ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను కూడా విక్ర‌యించ‌నున్నారు.

జియో మార్ట్ యాప్‌లో ఆర్డ‌ర్ చేసే వ‌స్తువుల‌కు గాను వినియోగ‌దారులు క్యాష్ ఆన్ డెలివ‌రీ రూపంలో న‌గ‌దు చెల్లించ‌వ‌చ్చు. లేదా క్రెడిట్‌, డెబిట్‌, నెట్ బ్యాంకింగ్ స‌దుపాయాల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక వ‌స్తువుల ఎంఆర్‌పీ ధ‌ర‌ల‌పై 5 శాతం తగ్గింపుతో స‌రుకుల‌ను విక్ర‌యిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version