క్రికెట్ అభిమానులకు “జియో సినిమా” గుడ్ న్యూస్…!

-

వరల్డ్ కప్ లో ఇండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఇండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో బుధవారం రోజు ముంబై వేదికగా ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికాల మధ్యన జరగనున్న రెండవ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఇండియాతో ఫైనల్ ఆడనుంది. కాగా ఈ వరల్డ్ కప్ ముగిశాక ఇండియా వరుస సిరీస్ లతో బిజీగా ఉండనుంది. ముందుగా నవంబర్ 23 నుండి డిసెంబర్ 3 వరకు ఆస్ట్రేలియా తో టీ 20 సిరీస్ , ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా లో వన్ డే మరియు టెస్ట్ సిరీస్, ఇండియా లో ఆఫ్ఘన్ తో టీ 20 సిరీస్, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జనవరి లో ఇండియా టెస్ట్ సిరీస్ ఆడనుంది.

కాగా పైన తెలిపిన సిరీస్ లు అన్నిటినీ కూడా జియో సినిమా ఓటిటి ఛానెల్ ఉచితంగా ప్రసారం చేయనుందని ప్రకటించింది. ఈ వార్తతో క్రికెట్ ను ఆరాధించే అభిమానులు అంతా చాలా ఆనందంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news