జియో చాక్లెట్ డేటా

-

జియో రెండో వార్సికోత్సవ ఆఫర్

ప్రతీ రోజు 2 జీబీ డేటా అదనం

క్యాడ్బరీ సంస్థకు చెందిన డైరీ మిల్క్ చాక్లెట్లు కొంటే జియో ఉచిత డేటా ను అందించనుంది.  రెండేళ్ల క్రితం ప్రారంభమైన జియో సేవలు టెలికం రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. అపరిమిత కాల్స్, ఉచిత డేటా సౌకర్యంతో ప్రత్యర్థి గుండెల్లో జియో దడ పుట్టించింది. ఈ నెల తో రెండో వార్సికోత్సవంలోకి ఆడుగుపెడుతున్న సందర్భంగా జియో  సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. సెలబ్రేషన్స్ ప్యాక్ ద్వారా జియో యూజర్లకు ప్రతీ రోజూ 2 జీబీ డేటాను అదనంగా ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న ప్యాక్ లలో లభిస్తున్న డేటాకు ఇది అదనం.

రెండో వార్సికోత్సవం సందర్భంగా జియో క్యాడ్బరీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా …డైరీ మిల్క్ చాక్లెట్, క్రాకెల్, డైరీ మిల్క్ రోస్ట్ ఆల్మండ్, డైరీ మిల్క్ ఫ్రూట్, నట్ తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి రోజుకు 1జీబీ 4జీ స్పీడుతో లభించనుంది. రూ. 5 నుంచి రూ. 100 చెక్లెట్ల కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తోంది. చాక్లెట్ వ్రాపర్ మీద ఉన్న బార్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా ఉచిత డేటాను జియో కష్టమర్లు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news