బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బన్ని

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీకి టైం వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ మీడియా వర్గాలు. మాములుగా కాదు ఏకంగా ఓ బయోపిక్ సినిమాతో బన్ని బాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ జరుగబోతుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ లీడ్ రోల్ కాదు. కబీర్ ఖాన్ డైరక్షన్ లో మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ సినిమాగాగా రానుంది.

ఈ సినిమాలో కపిల్ రోల్ లో రణ్ వీర్ సింగ్ సెలెక్ట్ అయ్యాడు. ఇక సినిమాలో ఇతర పాత్రలకు స్టార్స్ ను తీసుకుంటున్నారట. ఇండియాకు మొదటి ప్రపంచ కప్ తెచ్చిన కెప్టెన్ గా కపిల్ దేవ్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఇక ఆ టైంలో ఉన్న క్రికెటర్స్ అందరి పాత్రల్లో స్టార్స్ నటిస్తున్నారట. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ కృష్ణమాచార్యగా బన్ని కనిపిస్తాడట. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు పూర్తయ్యాయట.

బాలీవుడ్ లో బన్ని సినిమాల సందడి తెలిసిందే. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్ లో డబ్ అయ్యి యూట్యూబ్ లోనే సూపర్ హిట్ అయ్యాయి. ఫైనల్ గా బన్ని కూడా బీ టౌన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ది గెస్ట్ రోల్ అని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news