నిరుద్యోగులకు గుడ్ న్యూస్..నేడు తిరుపతి, గుంటూరు, విశాఖలో జాబ్ మేళాలు

-

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్. నేడు ఏపీలో జాబ్‌ మేళా జరుగనుంది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యులు, వైసిపి నేత విజయ సాయి రెడ్డి తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేశారు.

నేటి నుంచి మూడు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వైసీపీ కార్యకర్తల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరుపతి, విశాఖ, గుంటూరులలో జాబ్ మేళా నేడు ప్రారంభం అవుతుందని… 35 నెలల్లో ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. టిడిపి హయాంలో వారి కులపు వారికే ఉద్యోగాలు కట్టబెట్టారు… మేము కులాలకు, మతాలకు అతీతంగా ఉద్యోగాలు ఇవ్వనున్నామని స్పష్టం చేశారు.

147 కంపెనీలు వస్తున్నాయి. ఒక్క తిరుపతి సెంటర్ కు మాత్రమే 41 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సొంత పుత్రుడిని నమ్ముకొని వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దిగుతారా అని ఫైర్‌ అయ్యారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పే వ్యక్తి… ఒంటరిగా పోటీ చేయచ్చు కదా అని చురకలు అంటించారు. లోకేష్ స్టాన్ ఫోర్డ్ లో చదివారా అని అనుమానాలు ఉన్నాయి… 2024 తర్వాత టిడిపి ఉండదన్నారు…

 

Read more RELATED
Recommended to you

Exit mobile version