విద్యార్థులకు గుడ్ న్యూస్.. క్యాప్‌జెమినీలో భారీగా ఉద్యోగ అవకాశాలు..

-

సమ్మర్ లో విద్యార్థులకు మంచి ఊరట కలిగించే విషయాలు అందుతున్నాయి..ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలకు సంభందించిన అప్డేట్స్ రిలీజ్ అవుతున్నాయి. ప్రముఖ సంస్థ విప్రోలో ఉద్యొగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఇప్పుడు మరో కంపెనీ ఉద్యొగాల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కన్సల్టింగ్ కంపెనీ క్యాప్‌జెమినీ సంస్ధ భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనుంది.2019 నుండి 2021 సంవత్సరాలో ఉత్తీర్ణత సాధించిన టెక్నికల్, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది.

ఈ మేరకు ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ ను నిర్వహించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఎక్సెల్లర్ డైవర్సిటీ ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌లో ప్రస్తుతం మహిళలను మాత్రమే ఉద్యోగాల లోకి తీసుకోనున్నారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.2020,2021 లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ ఉద్యొగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాక్ లాగ్ ఉన్న వాళ్ళు అర్హులు కాదు.ఇండియాలోని క్యాప్‌జెమిని ఆఫీస్ లొకేషన్‌లలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. షిఫ్ట్‌లలో వారిగా పనిచేసేందుకు సిద్దమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జాబ్ లో చేరేముందు బాండ్ మీద సైన్ చెయాల్సి ఉంటుంది.

ఉద్యోగులు తాము అనుకున్న భవిష్యత్తును క్రియేట్ చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ప్రస్తుతం, క్యాప్‌జెమినీలో బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పూణే, సేలం, తిరుచిరాపల్లిలో 150,000 మంది పని చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.. త్వరలోనే మగవాల్లకు సంభందించిన నోటిఫికేషన్ విడుదల కానుందని, అధికారక వెబ్ సైట్ లో నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది.https://www.capgemini.com/careers/job-search/ లో పూర్తీ వివరాలను తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news