మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ పలు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. భారత ప్రభుత్వరంగానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తోంది. అయితే ఇందులో మొత్తం 59 ఖాళీలు వున్నాయి.
ఇక పోస్టుల వివరాలను చూస్తే.. నర్సింగ్ ట్రైనర్- 9, స్టాఫ్ నర్స్- 50 పోస్టులు వున్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులకు జీఎన్‌ఎమ్/బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలానే నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఏడాది అనుభవం కూడా తప్పనిసరి.
నర్సింగ్ ట్రైనర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఫ్రెషర్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక వయస్సు వివరాలను చూస్తే.. అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల వరకు ఇస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి వున్నవాళ్లు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2022. పూర్తి వివరాలను http://www.lifecarehll.com/ లో చూడచ్చు.