మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ గ్రూప్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన వారికి మంచి అవకాశాన్ని ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ మొత్తం 28 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంటీఎస్, పంప్ ఆపరేటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లైఫ్‌గార్డ్, కానిస్టేబుల్ మొదలైన పోస్టులను భర్తీ చేస్తోంది.
ఇక విభాగాల వివరాల లోకి వెళితే.. కుక్, క్యాంటిన్ అటెండెంట్, స్వీపర్, మోటార్ మెకానిక్, బ్యాండ్, జనరల్ డ్యూటీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి అని నోటిఫికేషన్ లో తెలిపారు. వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూస్తే.. ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.
శాలరీ నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు చెల్లిస్తారు. పది తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిజికల్ టెస్టు తేదీ 2022, ఏప్రిల్ 25, 28. పూర్తి వివరాలని http://nepa.gov.in/ లో చూడచ్చు. ఈ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ, ఉమయుం, మేఘాలయ-793123.