భీమ్లా నాయక్.. గత కొద్ది రోజుల ముందు థీయేటర్ లలో విడుదల అయి.. ఎన్నో సంచలనాలను సృష్టించింది. చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మాస్ ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ఈ భీమ్లా నాయక. బాక్సాఫీస్ ను కాకుండా ఓవర్సీస్ ను కూడా భీమ్లా నాయక్ షేక్ చేసింది. కేవలం 20 రోజుల్లోనే రూ. 200 కోట్ల కలెక్షన్ లను భీమ్లా నాయక్ సొంతం చేసుకుంది.
కాగ పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కలిసి మల్టీ స్టారర్ గా నటించిన భీమ్లా నాయక్.. ఓటీటీ విడుదల కు సిద్ధం అవుతుంది. ఈ నెల 25వ తేదీన ఓటీటీలో విడుదల చేయాలని మొదట చిత్ర బృందం ప్రకటించింది.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుంది. ఒక రోజు ముందుగానే అంటే ఈ నెల 24 వ తేదీన “భీమ్లా నాయక్” ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24 వ తేదీన “భీమ్లా నాయక్” ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.